దరఖాస్తు స్థితిని తెలుసుకునే వెసులుబాటు

దరఖాస్తు స్థితిని తెలుసుకునే వెసులుబాటు
ప్రజా సమస్యల పరిష్కారంలో సరికొత్త ఒరవడికి ప్రభుత్వం తెరతీసింది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉండి అంతర్జాల సదుపాయం ఉంటే ఇంటి నుంచే వినతులు పంపొచ్ఛు వినతి ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్ఛు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన. ఇందులో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు ఆన్లైన్లో వినతులు పంపే వీలు కల్పించింది.
ఇంటి నుంచే సెల్‌ఫోన్ ద్వారా సంబంధిత సమస్యను ప్రభుత్వానికి నివేదించవచ్ఛు ఆయా ప్రభుత్వ శాఖలకు ఇవి నేరుగా చేరుతాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది.
అంతర్జాల పరిజ్ఞానం ఉంటే ప్రభుత్వ కార్యాలయాల వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది.
మండల కేంద్రాలకు వెళ్లి అర్జీలు ఇవ్వడం పెద్దగా కష్టం కాకున్నా.. జిల్లా కేంద్రాలకు వెళ్లి ఇవ్వాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అర్జీల స్వీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా, మండలం, గ్రామం తదితర వివరాలు నమోదు చేసేలా పోర్టల్‌ను తీర్చిదిద్దారు.
నిరీక్షించాల్సిన పనిలేదు
ఏదైనా సమస్యపై వినతి లేదా దరఖాస్తు అందించాలంటే ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వెళ్లాలి. నిర్ణీత సమయానికి అక్కడకు వెళ్లడంతోపాటు క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు సమయానికి చేరుకోలేకపోతే వినతులు అందజేయడం కుదరకపోగా.. మళ్లీ సోమవారం వరకు వేచి ఉండాల్సి వస్తోంది. దరఖాస్తు చేసిన వారిలో కొందరికి రశీదులు ఇవ్వడం లేదు. ఆన్లైన్లో రోజులతో పనిలేకుండా ఎప్పుడైనా వినతులు పంపవచ్ఛు
వినతులు ఇలా..
దరఖాస్తు చేయాలంటే మొదట ఆన్లైన్ యూజర్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ప్రత్యేకంగా యాప్ తెరపై కనిపిస్తుంది. ఆన్లైన్ సిటిజన్ లాగిన్‌ను క్లిక్ చేయాలి. ఆధార్ నంబరును నమోదు చేయమని అడుగుతుంది.
అనంతరం ఆధార్‌కు అనుసంధానమైన సెల్‌ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీనిని నమోదు చేసిన వెంటనే స్పందన అర్జీ పేజీ మొదలవుతుంది.
మొదటిది యూజర్ బాక్స్, రెండోది అర్జీ నమోదు, మూడోది అర్జీ నకలు జత చేయడం. యూజర్స్ ఇన్‌బాక్స్‌ను క్లిక్ చేస్తే గతంలో ఆధార్‌తో అనుసంధానమైన అర్జీలు నమోదు చేసి ఉంటే వివరాలు కనిపిస్తాయి.
వాటి ప్రగతి తెలుసుకోవచ్ఛు రెండోది అర్టీ నమోదుపై క్లిక్ చేస్తే స్పందన దరఖాస్తు కనిపిస్తుంది. ఇందులో ఫిర్యాదు చేయాల్సిన ప్రభుత్వ శాఖ వివరాలు ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్ఛు