ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని లక్డీకాపూల్‌లో గల ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని రక్తనిధి కేంద్రంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై 8.30కి తమకు సమాచారం అందిందన్నారు.
దీంతో అసెంబ్లీ ఫైర్ స్టేషన్ నుంచి ఓ వాహనం, సెక్రటేరియట్ ఫైర్ స్టేషన్ నుంచి మరో వాహనం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఎగసిపడుతున్న మంటలను సిబ్బంది అర్థగంటలోపే అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించడంతో ఆస్పత్రి సిబ్బంది, స్థానిక పోలీసులు రోగులను అక్కడి నుంచి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లుగా పేర్కొన్నారు.