విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు
డయల్ యువర్ ఏయూకు స్పందన
మహిళల హాస్టల్లో మరుగుదొడ్ల బ్లాక్, వేడినీటి పరికరాలను ప్రారంభిస్తున్న
మాజీ ఎంపీి కంభంపాటి హరిబాబు, వీసీ నాగేశ్వరరావ
ఆంధ్రవిశ్వవిద్యాలయం నెల నెలా నిర్వహిస్తున్న డయల్ యువర్ వర్సిటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఫోన్లో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వీసీ ఆచార్య నాగేశ్వరరావు సమాధానాలిచ్చారు.
ఏపీ పీజీఈసెట్ ప్రవేశాలు, బీఎడ్ మూడో మెథడాలజీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు, బీఎస్సీ స్పెషల్ డ్రైవ్ పరీక్షలపై విద్యార్థులు తమ సందేహాలను వీసీ దృష్టికి తీసుకువెళ్లారు.
కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, అకడమిక్ డీన్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, దూర విద్య సంచాలకులు ఆచార్య పి.హరిప్రకాష్, సీడీసీ డీన్ ఆచార్య సి.హెచ్. పాండురంగారెడ్డి, పరీక్షల డీన్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం వర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు తరగతి గదులు, భవనాలను నిర్మిస్తున్నామన్నారు.
బీచ్‌రోడ్డులో కన్వెన్షన్ సెంటర్‌కు అనుబంధంగా రూ.1.25కోట్లతో నిర్మించిన డైనింగ్ హాల్‌ను వీసీ ప్రారంభించారు. ఇందులో ఒకే సారి ఐదు వందల మంది భోజనాలు చేయవచ్ఛు మహారాణిపేటలోని మహిళా వసతి గృహంలో విశాఖ మాజీ ఎంపీ కె.హరిబాబు నిధులు రూ.30లక్షలతో నిర్మించిన మరుగుదొడ్ల బ్లాక్‌ను హరిబాబుతో కలిసి వీసీ ప్రారంభించారు.
విద్యార్థినులకు సౌరశక్తితో వేడినీటిని అందించే పరికరాలను మాజీ ఎం.పి. ప్రారంభించారు. శివాజీపాలెం మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన అదనపు అంతస్తును వీసీ నాగేశ్వరరావు ప్రారంభించారు.
దీని నిర్మాణానికి రూ.80లక్షలు ఖర్చుచేశారు. ఇందులో ప్రయోగశాలలు, తరగతులు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం కోసం నూతనంగా నిర్మించే భవనానికి వీసీ శంకుస్థాపన చేశారు. రూ.రెండు కోట్ల వ్యయంతో తొమ్మిది నెలల కాలవ్యవధిలో దీన్ని నిర్మించనున్నారు.
కార్యక్రమాల్లో ఏయూ రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, చీఫ్ ఇంజినీర్ ఎం.జి.మాధవబాబు, ప్రిన్సిపల్ ఆచార్య ఎం.ప్రమీలదేవి, డీన్ ఆచార్య వజీర్ మహ్మద్, చీఫ్ వార్డెన్ పి.సునీత పాల్గొన్నారు.