News

Realestate News

నేటి నుంచి ఓటర్ల జాబితా పరిశీలన

Examining list of voters from today.


నేటి నుంచి ఓటర్ల జాబితా పరిశీలన

 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

2020 ఫొటో ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగంగా ఎన్నికల కమిషన్‌ ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు.

ఉత్తర నియోజకవర్గంలో నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించనున్నట్లుగా అధికారులు తెలిపారు. బీఎల్వోలకు ఇచ్చిన ఇంటి నెంబర్ల ఆధారంగా సర్వే చేయనున్నారు.

ఓటర్ల జాబితాలో రెండుసార్లు నమోదైన పేర్ల గుర్తింపు, తప్పులను సరిచేయడం, ఫొటోలను పెట్టడం పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు.

ఓటర్ల హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా, వివరాలు సహా, ఫొటో సక్రమంగా ఉందా లేదా తెలుసుకోవచ్ఛు ఇలా పక్కా ప్రణాళికతో వివరాలను నమోదు చేయనున్నారు.

సర్వేలో చేపట్టనున్న కార్యక్రమాలు

ఓటరు జాబితా సవరణలో భాగంగా నేటి నుంచి 30 వరకు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బీఎల్వోలు తమ వద్ద ఉన్న ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటి సర్వే చేపట్టాలి.

తద్వారా దరఖాస్తులోని వివరాలు నేరుగా పరిశీలిస్తారు. మృతిచెందిన, రెండుసార్లు నమోదైన, బోగస్‌ ఓటర్లను గుర్తిస్తారు. 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వారు ధ్రువీకరణ పత్రాలను జతచేసి కొత్త ఓటరుగా నమెదు

కోసం ఫారం-6 దరఖాస్తును బీఎల్వోలకు అందజేయవచ్ఛు ప్రతి శని, ఆదివారాల్లో ఆయా వార్డుల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమాలను నిర్వహించి, నూతన ఓటర్ల దరఖాస్తులు, సవరణకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అక్టోబర్‌ 15న ముసాయిదా ప్రకటించనున్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo