పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం

పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం
స్పాట్‌కు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు
డీఈవో లింగేశ్వరరెడ్డి
అధికారులతో చర్చిస్తున్న డీఈఓ లింగేశ్వరరెడ్డి
పదో తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం పాతనగరంలోని క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభమైంది. విశాఖ జిల్లా మినహాయించి మిగిలిన 12 జిల్లాల నుంచి వచ్చిన ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియకు 1200 మంది ఉపాధ్యాయులను నియమించామని డీఈఓ లింగేశ్వరరెడ్డి తెలిపారు.
తొలిరోజు విధులకు హాజరు కాని ఉపాధ్యాయులను గుర్తించామని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ సంజాయిషి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్పాట్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. డీఈఓ అధ్యక్షతన ఉప విద్యాశాఖాధికారి రామరాజు, మండల విద్యాశాఖాధికారులు, సీనియర్ ప్రధానోపాధ్యాయులతో వేసిన కమిటీ అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నదని ఆయన తెలిపారు. ఏ రోజు సమాచారం ఆరోజు పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా పంపించనున్నామని తెలిపారు.