తెలుగు భాషాభివృద్ధికి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి

తెలుగు భాషాభివృద్ధికి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి

తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న మాడభూషి శ్రీధర్
తెలుగుభాషాభివృద్ధికి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని సమాచార హక్కు చట్టం విశ్రాంత కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు.
ఆదివారం పిఠాపురంకాలనీలో పరవస్తు పద్యపీఠం అధ్యక్షుడు పరవస్తు సూరి ఆధ్వర్యంలో తెలుగుదండు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగును అధికార భాషగా ప్రాథమిక విద్య నుంచే బోధించాలన్నారు.
యువత తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాలన్నారు. పరవస్తు పద్యపీఠం అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ అగస్టు 29 తెలుగుభాషా దినోత్సవం నాటికి తెలుగు దండు ఆధ్వర్యంలో పది డిమాండ్లను తయారు చేసి వాటిపై చర్చించి భాషాభివృద్ధికై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
ప్రధానంగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రాంతీయ భాష అమలు చేయాలని, ప్రభుత్వ, న్యాయపాలన తెలుగులో జరగాలని కోరారు.
కార్యక్రమంలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సూరపునేని విజయ్‌కుమార్, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.