News

Realestate News

కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశాలు షురూ..

Entrepreneurs in corporate colleges.


కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశాలు షురూ..

మొదటి దశలో 333 మందికి సీట్ల కేటాయింపు

విద్యార్థులకు ప్రవేశాల ఉత్తర్వులు అందజేస్తున్న డి.డి. జయప్రకాష్‌

 కార్పొరేట్‌ విద్యా పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీల్లో చదివి పదో తరగతిలో ఉత్తమ గ్రేడ్‌ పాయింట్లు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.

పదిలో 7 అంత కంటే ఎక్కువ జీపీఏ సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

* విద్యార్థుల ధ్రువపత్రాలను గురువారం ఉదయం పరిశీలించి, కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఉత్తర్వులను సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు జయప్రకాష్‌ విడుదల చేశారు.

ఆయన మాట్లాడుతూ జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లను కేటాయించి, వారి ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపామన్నారు.

* మొదటి దశలో జిల్లాకు 333 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారని, ఆయా విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ప్రవేశ ఉత్తర్వులు అందజేస్తామన్నారు.

ఈనెల 8వ తేదీ వరకు మొదట దశలో సీట్లు పొందిన విద్యార్థులు ప్రవేశాలు పొందాలని, లే ని పక్షంలో రెండో దశ విద్యార్థులతో ఆయా సీట్లను భర్తీ చేస్తామన్నారు.

నచ్చిన కళాశాల ఎంపిక చేసుకోవచ్చు..

* విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చని జయప్రకాష్‌ తెలిపారు. జిల్లాలో ఎండాడ దరి ఎన్‌ఆర్‌ఐ, ద్వారకానగర్‌ దరి ఎన్‌ఆర్‌ఐ కళాశాల, నర్సీపట్నం డాన్‌బాస్కో కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.

ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాలకు సంబంధించిన ఫీజులు ప్రభుత్వం చెల్లిస్తుందని, ప్యాకెట్‌మనీ కూడా ఇస్తుందన్నారు.

* ఎస్సీ విద్యార్థులు బాలురు 37, బాలికలు 62 చొప్పున 99 మందికి, ఎస్టీ బాలురు 57, బాలికలు 87 చొప్పున 144 మందికి, బీసీ బాలురు 25, బాలికలు 38 చొప్పున 63 మందికి, ఈబీసీ బాలురు 5, బాలికలు 12 చొప్పున 17 మందికి, బీసీ సీ 1, మైనార్టీలు 5, వికలాంగులు 5 మంది చొప్పున మొత్తం 333 మంది విద్యార్థులతో మొదట దశ సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.