News

Realestate News

ఎలమంచిలిలో రూ. కోటితో అభివృద్ధి పనులు

Development works groundbreakings

ఎలమంచిలిలో రూ. కోటితో అభివృద్ధి పనులు
మున్సిపాలిటీలో ఆర్‌జేడీ ఆశాజ్యోతి సుడిగాలి పర్యటన

ఎలమంచిలి, న్యూస్‌టుడే : ఎలమంచిలి మున్సిపాలిటీలో 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పురపాలక శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు (ఆర్‌జేడీ) ఆశాజ్యోతి ఆదేశించారు. ఎలమంచిలి మున్సిపాలిటీలో రూ. కోటి వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం ఆమె తనిఖీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. పెదపల్లి, కాకివాని వీధి, ధర్మవరం ప్రాంతాల్లో నిర్మిస్తున్న సులభ్‌కాంప్లెక్స్‌లను పరిశీలించారు. గాంధీనగరంలో నిర్మిస్తున్న కాలువలను తనిఖీ చేశారు. రుద్రభూమి సమీపంలో నిర్మిస్తున్న షెడ్లను పరిశీలించారు. డిసెంబరులోగా పనులు పూర్తిచేయకపోతే నిధులు మురిగిపోతాయన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. సులభ్‌ కాంప్లెక్స్‌లు వేగవంతం చేయాలన్నారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, మెరుగుపరచాలని ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని, కార్యాలయంలో పనులు పెండింగ్‌లో పెట్టొద్దని, అక్రమ కట్టాడాలపై దృష్టిసారించాలని చెప్పారు. అనుమతుల్లేకుండా చేపడుతున్న పనులకు నోటీసులు ఇచ్చి నిలిపివేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రమాకుమారి, కమిషనర్‌ వేగి సత్యనారాయణ, టీపీఓ.గౌరు, మేనేజర్‌ ఒమ్మి సన్యాసిరావు, బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వరరావు, డీఈఈ సురేష్‌కుమార్‌, ఏఈ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo