జమ్ముకశ్మీర్లో భూప్రకంపనలు
జమ్ముకశ్మీర్లో భూప్రకంపనలు

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో మరోసారి భూమి స్వల్పంగా కంపించింది. కశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్, కిస్టావర్, దోడా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మంగళవారం ఉదయాన్నే భూప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని రోడ్లపైకి పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8 గా నమోదైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సమాచారం ఇంకా ఏదీ రాలేదు. మూడు రోజుల్లో వరుసగా మూడో రోజు కశ్మీర్ లోయతోపాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భూ ప్రకంపనలు తజికిస్తాన్ నుంచి ప్రారంభమైనట్లు గుర్తించారు. మంగళవారం నాడు శ్రీనగర్, కిస్టావర్, దోడా జిల్లాలతోపాటు జమ్ములో కూడా భూమి కంపించిందని అధికారులు చెప్తున్నారు.