నేడు జీవీఎంసీలో ఇ-పోస్ యంత్రం ప్రారంభం

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాక
కార్పొరేషన్:
మహా విశాఖ నగరపాలక సంస్థలో ఇ-పోస్ యంత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. ప్రధాన కార్యాలయంలోని సెల్లార్లో ఏర్పాటుచేయనున్న ఇ-పోస్ యంత్రం ద్వారా ఆస్తి పన్ను చెల్లింపు, నీటి పన్ను, పట్టణ ప్రణాళిక సంబంధిత ఫీజులు ఇతర రుసుముల చెల్లింపులు చేయవచ్చు.
రాష్ట్రంలోని మరే ఇతర స్థానిక సంస్థలోనూ ఈ తరహా ఏర్పాటులేదు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో యంత్రాన్ని ఏర్పాటు చేసిన అనంతరం జోనల్ స్థాయిలో ఉన్న ‘సౌకర్యం’ కేంద్రాల వద్ద ఇ-పోస్ యంత్రాలను అమర్చనున్నారు. ప్రధాన కార్యాలయంలో ఇ-పోస్ యంత్రం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను కమిషనర్ హరినారాయణన్, అదనపు కమిషనర్లు ఎస్ఎస్ వర్మ, మోహన్రావు, యూసీడీ పీడీ శ్రీనివాసన్ పర్యవేక్షించారు