నిర్విరామంగా పదిగంటల హాస్యం

నిర్విరామంగా పదిగంటల హాస్యం

ఇమంది ఈశ్వరరావు దంపతులను సత్కరించి ధ్రువీకరణ పత్రాన్ని
అందిస్తున్న ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు తదితరులు
ఓ గంట హాస్యం పండించడమే ఎంతో విశేషం. అలాంటిది పదిగంటలపాటు నిర్విరామంగా ప్రదర్శించిన హాస్య లఘునాటిక(స్కిట్లు)లు రెండు రికార్డులకెక్కాయి.
ఆదివారం హాస్యప్రియ కామెడీ క్లబ్ సభ్యులు నిర్వహించిన కామెడీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డుల కెక్కింది. హాస్యప్రియ కామెడీ క్లబ్ అధ్యక్షులు ఇమంది ఈశ్వరరావు నేతృత్వంలో విశాఖ పౌరగ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉదయం 9.46 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు, విజయనిర్మాణ కంపెనీ అధ్యక్షులు డాక్టర్ సూరపునేని విజయకుమార్లు దీన్ని ప్రారంభించగా సాయంత్రం 7.45 నిమిషాలకు ముగిసింది. ఇందులో 120 హాస్య లఘునాటికలు ప్రదర్శించారు.
ఒక్కో లఘునాటికకు మధ్యలో దుర్గాప్రసాద్ చేసిన వ్యాఖ్యానం, హాస్యోక్తులు ఆహూతులను కడుపుబ్బా నవ్వించాయి. వీటిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు ఇన్ఛార్జి వేముల భాస్కరాచారి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు ఇన్ఛార్జి కోరుకొండ రంగారావు పర్యవేక్షించారు.
సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖులు ఇమంది ఈశ్వరరావు దంపతులను సత్కరించి ధ్రువీకరణ పత్రాలు అందించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.