కృష్ణా కళాశాల ప్రహరీ కూల్చివేత

కృష్ణా కళాశాల ప్రహరీ కూల్చివేత
కొనసాగిన నిరసనలు

డాక్టర్ వీఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని ఇప్పటికే ఆందోళనలు జరుగుతుండగా గురువారం నిరసనలు తీవ్రమయ్యాయి.
కళాశాల ప్రాంగణంలో కబ్జా చేసి కట్టారని భావిస్తున్న ప్రహరీని పలు విద్యార్థి సంఘాలు కూల్చివేశాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఐక్యవేదిక (ఎపీజెఎసీ), జనజాగరణ సమితి, ఎస్.ఎఫ్.ఐ. సంఘాలు ఈ కూల్చివేతలో పాల్గొన్నాయి.
దీనికి ముందు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కళాశాల స్థలాలను పరిరక్షించాలని కోరారు.
* ఆక్రమణలకు గురవుతున్న కళాశాల స్థలాలకు రక్షణ కల్పించాలని ఎస్.ఎఫ్.ఐ. కృష్ణా కళాశాల కమిటీ సంతకాల సేకరణ నిర్వహించింది.
కృష్ణా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మన్ కుమారమంగళం మాట్లాడుతూ.. విద్యార్థుల చదువులకంటూ ఎందరో దాతలు ఇచ్చిన స్థలాల్ని ఆక్రమించటం అన్యాయమన్నారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి ఆర్కే ఎస్వీకుమార్, తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కళాశాల స్థలం ఆక్రమణకు గురైందని ఆరోపిస్తూ ప్రహరీ కట్టిన స్థలంలో మోకాళ్లపై జనజాగరణ సమితి ప్రతినిధులు నిరసన తెలిపారు. రాష్ట్ర కన్వీనర్ కె.వాసు, సి.హెచ్.సునీల్‌కుమార్, శైలజ, తదితరులు పాల్గొన్నారు.
* ఏపీ జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఐక్యవేదిక ఛైర్మన్ జె.టి.రామారావు ఆధ్వర్యంలో కళాశాల ప్రధాన ముఖద్వారం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు చేపట్టారు. అనంతరం పలు విద్యార్థి సంఘాలతో కలసి ప్రహరీ కూల్చివేతలో పాల్గొన్నారు.