News

Realestate News

‘మన సంస్కృతి సంప్రదాయాలే మిన్న’

culture traditions must important .


‘మన సంస్కృతి సంప్రదాయాలే మిన్న’

జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న సాలూరు వాసూరావు

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని నేటితరం పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సినీసంగీత దర్శకులు సాలూరు వాసూరావు అన్నారు.

ఆదివారం సాయంత్రం ఆంధ్రవిశ్వకళాపరిషత్తు టి.ఎల్‌.ఎన్‌.సభాహాలులో సమైక్య భారతి సంస్థ ఆధ్వర్యంలో ‘సంస్కృతి – విలువలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఆచార్య మంజులత ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వాసూరావు మాట్లాడుతూ ఇతర దేశాలు మన సంస్కృతిని గొప్పగా భావిస్తుంటే మనం ఇతర దేశాల సంస్కృతి వైపు పరుగులు తీస్తున్నామన్నారు.

సినీ దర్శకులు రేలంగి నర్సింగరావు మాట్లాడుతూ సంపద, ఉద్యోగాల వ్యామోహంలో విదేశాలకు వెళ్తున్నవారు తల్లిదండ్రుల యోగక్షేమాలను విస్మరిస్తున్నారన్నారు.

ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య టి.బైరాగిరెడ్డి, ప్రజాగాయకులు వంగపండు ప్రసాదరావు, సమైక్య భారతి జాతీయ కన్వీనర్‌ కన్నయ్య తదితరులు కూడా ప్రసంగించారు.