Posted on May 24, 2019 by Mohan Manikanta in Realestate News
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
రాకపోకల నిలిపివేతతో అవస్థలు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన కౌంటింగ్ని పురస్కరించుకుని మద్దిలపాలెం ఏయ ప్రధాన ద్వారం దరి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పాస్లు ఉన్నవారినే లోపలికి అనుమతించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల జాడ కనిపించలేదు.
దీంతో ఎలాంటి అల్లర్లు జరగలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి ఫలితాలు చివరి దశకి రావడంతో వైకాపా, తెదేపా పార్టీల శ్రేణులు కొద్దిగా హడావిడి చేయడానికి ద్వారం దగ్గరకు చేరుకున్నారు.
అయితే ఎలాంటి నినాదాలు చేయకూడదంటూ వారిని పోలీసులు అక్కడ నుంచి పంపించేశారు. దీంతో వారికి, పోలీసులకి మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఒకవేళ అల్లర్లు జరిగితే వాటిని నిలపుదల చేసేలా పోలీసులు భారీగా మోహరించారు.
రాకపోకలతో ఇబ్బందులు
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి ఏయ ప్రధాన ద్వారం దరి రాకపోకలు వసివేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకి గురయ్యారు. ఆ మార్గం మీదుగా ఆసుపత్రికి, అవతలి ప్రాంతానికి వెళ్లాల్సిన వారు చుట్టూ తిరగాల్సి వచ్చింది.
వాహనాలపై ప్రయాణించే వారి మాట ఎలా ఉన్నా పాదచారులు మాత్రం ఎండలో చుట్టూ నడుచుకొని వెళ్లారు. దీంతో చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలతో ఉన్నవారికి ఇక్కట్లు తప్పలేదు.
పలువురు వాహనదారులు సాయంత్రం సమయాల్లో కూడా అనుమతి ఇవ్వాలని కోరినా పోలీసులు నిరాకరించారు. ఈ విషయంపై పోలీసులు, వాహనదారులకి మధ్య ఘర్షణ తలెత్తింది. అయితే వారికి సర్దిచెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.
Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399