News

Realestate News

దేశంపై కరోనా దండయాత్ర..18,55,745 మందికి పాజిటివ్

దేశంపై కరోనా దండయాత్ర..18,55,745 మందికి పాజిటివ్

                                                    

సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు అంతా కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతిరోజూ 50 వేలకు తక్కువ కేసులు రావడమే లేదు. భారత్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 52,050 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలను గుర్తించారు.

803 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 6,61,892 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 44,306 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

తాజా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,745గా ఉంది. 38,938 మంది మహమ్మారికి బలి అయ్యారు. 12,30,509 మంది వైరస్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. ఇంకా

5,86,298 మంది ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారితో పాటు డిశ్చార్జ్ సంఖ్య కూడా పెరుగుతుండటం కొంత ఊరట కలిగించే విషయం. దేశంలో రికవరీ రేటు 66.31గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 2,08,64,750 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 18,446,766 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.

వీరిలో 697,222 మంది మరణించారు. 11,677,723 మంది కోలుకోగా.. ఇంకా 60,71,821 మంది చికిత్స పొందుతున్నారు.