మీర్‌పేటలో ఒకే కుటుంబంలో 12మందికి కరోనా
మీర్‌పేటలో ఒకే కుటుంబంలో 12మందికి కరోనా

హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో పదుల్లో కేసులు నమోదు అయితే సడలింపుల తర్వాత కేసులు వందల్లో నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. రాజధాని హైదరాబాద్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
తాజాగా మీర్‌పేట పరిధిలో ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు వెల్లడించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారితో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.