News

Realestate News

భారత్‌లో 59కి చేరిన కరోనా కేసులు

59 carona cases in india

భారత్‌లో 59కి చేరిన కరోనా కేసులు

                                                                                        

పుణె: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఒక్క మహారాష్ట్రలో మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 59కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. పుణెకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్‌ నవల్‌ కిశోర్‌ రామ్‌ తెలిపారు.

ఈ ముగ్గురితో కలిపి మహారాష్ట్రలో కరోనా సోకిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లు తెలిపారు.

ఇటీవల దుబాయ్ నుంచి మహారాష్ట్ర వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా సోకిన ముగ్గురు ఆ దుబాయ్‌ నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు కలెక్టర్‌ కిశోర్‌ తెలిపారు. వారిని స్థానికంగా ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు కేరళలో కొత్తగా ఆరు కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ మంగళవారం ఉదయం వెల్లడించిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి ఎక్కువ అవుతుండటంతో రాష్ట్రంలోని పాఠశాలలు, థియేటర్లు మార్చి 31 వరకు మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి

కరోనా: కేరళలో ఆరుగురు, కర్ణాటకలో ముగ్గురు