‘పది’లో మెరిసిన ప్రయివేటు విద్యార్థులు

‘పది’లో మెరిసిన ప్రయివేటు విద్యార్థులు

ఉత్తీర్ణులైన విద్యార్థులతో నారాయణ అధ్యాపకులు
పదోతరగతి ఫలితాల్లో నగరంలోని వివిధ ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఉత్తరాంధ్ర నుంచి శ్రీ చైతన్య పాఠశాలల విద్యార్థులు 960 మంది 10 జీపీఏ, 1719 మంది విద్యార్థులు 9.8కిపైగా జీపీఏ సాధించారని పాఠశాల ఉత్తరాంధ్ర ఏజీఎం ఎంవీ సురేష్ తెలిపారు.
విశాఖ నుంచి 598 మంది విద్యార్థులు 10 జీపీఎ, 1094 మంది 9.8 జీపీఏ సాధించారని అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్‌రావు, రీజనల్ ఇన్‌ఛార్జిలు వై.ఆశిబాబు, అలీ, ఎమ్.రమణ అభినందించారు.
నారాయణ విద్యార్థుల ప్రతిభ..
పదోతరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన నారాయణ విద్యార్థులను డీజీఎం జి.రాజ్‌కుమార్ అభినందించారు. మంగళవారం సాయంత్రం ఆశీలుమెట్టలోని డీజీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
మొత్తం 460 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ప్రతి ముగ్గురిలో ఒకరు 10 జీపీఏ సాధించారన్నారు. స్కూల్ ఎగ్జిక్యూటివ్ డీన్ రామ్‌నరేష్ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ప్రశంసించారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీన్లు వి.స్వామినాయుడు, జగదీష్, ప్రిన్సిపల్ ఎస్.ధనలక్ష్మి, రఘుబాబు, వేణుగోపాలరావు, రేఖ, వాసంతి, లక్ష్మీప్రసాద్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను అభినందిస్తున్న శ్రీచైతన్య ఏజీఎం ఎంవీ సురేష్
రవీంద్రభారతి విద్యార్థుల సంచలనం…
పదోతరగతి ఫలితాల్లో 134 మంది రవీంద్రభారతి విద్యార్థులు 10 జీపీఏ సాధించారని పాఠశాలల ఛైర్మన్ ఎంఎస్ మణి తెలిపారు. ద్వారకానగర్ రవీంద్ర]భారతి పాఠశాలలో 10 మంది విద్యార్థులు 10 జీపీఏ, 9 మంది 9.8 జీపీఏ సాధించారని జోనల్ ఇన్‌ఛార్జి వెంకటేష్ తెలిపారు.
ప్రతిభ చూపిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల జనరల్ మేనేజర్ జీఆర్ వసంత, డీన్ శ్రీదేవి, ప్రిన్సిపల్ మీనామిశ్రా, ఏజీఎం జీవీఎస్‌మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తీర్ణులైన విద్యార్థులతో రవీంధ్రభారతి ఉపాధ్యాయులు
శ్రీప్రకాశ్ ప్రభంజనం
గురుద్వారా, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో శ్రీప్రకాశ్ విద్యార్థులు నూటికి నూరుశాతం ఫలితాలతో విజయభేరీ మోగించారు. పాఠశాల నుంచి 51 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా ఎనిమిది మంది విద్యార్థులు 10/10 సాధించారు.
ఆరుగురు 9.8పాయింట్లు, ఏడుగురు 9.7 పాయింట్లు, 36 మంది 9 పాయింట్లకి పైగా మార్కులు సాధించారు. విద్యార్థులను, విజయానికి సహకరించిన సిబ్బందిని, తల్లిదండ్రులను పాఠశాల నిర్వాహకులు చిట్టూరి వాసుప్రకాశ్ అభినందించారు.