News

Realestate News

ప్రణాళికబద్ధంగా చదివితే విజయం మీదే

concentration on education will get the victory, realestatevizag news

పాడేరు :

అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లగలిగితే విజయం తప్పక వరిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కుడుముల కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు వుడా వీసీ బాబురావునాయుడుతో పాటు పాడేరు డీఎస్పీ మహేంద్ర, చింతూరు డీఎస్పీ దిలీప్‌కుమార్‌, విజయవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ బాలకృష్ణ పాల్గొని తమ అనుభవాలను అభ్యర్థులకు వివరించారు.

ఈ సందర్భంగా వుడా వీసీ బాబురావునాయుడు మాట్లాడుతూ ఏజెన్సీలో మౌలిక సదుపాయాలు లేని సమయంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పోటీ పరీక్షల్లో నెట్టుకు రాగలిగామని చెప్పారు. పాడేరు డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడిలకు, బిడియాలకు లోను కాకుండా గుండె నిబ్బరంతో సాధన చేయాలని సూచించారు.

విశాఖ మన్యానికి చెందిన ప్రస్తుత చింతూరు డీఎస్పీగా పని చేస్తున్న దిలీప్‌ కుమార్‌ మాట్లాడుతూ పెద్ద శిక్షణ సంస్థలో చదివితేనే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తామనే భావన నేటి యువత వీడనాడాలన్నారు.

సర్కారీ బడుల్లో చదివినా ముందుస్తుగా శిక్షణ సంస్థలో చేరి తర్ఫీదు పొందగలిగితే విజయం వరిస్తుందన్నారు. విజయవాడ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న పాడేరు పట్టణానికి చెందిన బాలకృష్ణ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం పలువురు అభ్యర్థులు తమ సందేహాలను ముఖ్య అతిథులను అడిగి నివృత్తి చేసుకున్నారు.

సదస్సుకు గిరిజన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉపాధ్యక్షులు భాస్కరరావు, ఉద్యోగ సంఘ నాయకులు జగన్‌మోహన్‌రావు, జయ ప్రసాద్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo