News

Realestate News

ఏయూలో ప్రాంగణ ఎంపికలకు ఆసక్తి చూపుతున్న కంపెనీలు

Companies interested in campus options at AU.

ఏయూలో ప్రాంగణ ఎంపికలకు ఆసక్తి చూపుతున్న కంపెనీలు

ఇవే కాదు ఎన్నో ప్రముఖ సంస్థలు 2018-19 సంవత్సరానికి వందలమంది ఏయూ విద్యార్థులను ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలకు తీసుకున్నాయి.

ఒక కళాశాల సామర్థ్యాన్ని కొలిచేందుకు ‘ప్రాంగణ ఎంపికలే’ కీలకం మరి. అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు.. ఇటు ఆ కళాశాలలకు లభించే న్యాక్‌ తరహా గుర్తింపులకు కూడా ఈ ఎంపికలే కీలకం. అందుకే ఆయా కళాశాలలు తమ ప్రచారాల్లో సైతం వీటిని కచ్చితంగా ఉదహరిస్తుంటాయి.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ విషయంలో మిగతా వాటికంటే ముందు వరుసలో నిలిచింది. 2014 నుంచి 2019 నాటికి సైన్స్‌ గ్రూపుల్లో ఎన్నో రెట్లు ఉద్యోగావకాశాలను పెంచుకోవడమే దీనికి నిదర్శనం.

 

ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్‌ కోర్సుల్లో 24 విభాగాలున్నాయి. వీటిలో అన్ని విభాగాలకు విపరీతమైన పోటీ ఉంది. అన్నింటిలో ఉద్యోగాలు ఇస్తామంటూ వివిధ కంపెనీలు వస్తున్నాయి. 2014 సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు భారీస్థాయిలో ప్రాంగణ ఎంపికలు జరుగుతున్నాయి.

విశాఖపట్నం, హైదరాబాద్‌ నగరాల నుంచే కాకుండా నొయిడా, దిల్లీ వంటి దూరప్రాంతాల నుంచి వివిధ కంపెనీలు ఇక్కడికొస్తున్నాయి. ఫార్మా కంపెనీలతో పాటు శ్రీచైతన్య, నారాయణ, ఆకాష్‌, భాష్యం, ఆదిత్య, వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు నేరుగా వర్సిటీలోనే ప్రాంగణ ఎంపికలు చేస్తున్నాయి.

కలిసి వస్తున్న సీమన్స్‌

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రూ. 300 కోట్లతో సీమన్స్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థి చదువుతుండగానే.. పలు పరిశ్రమలకు అనుకూలంగా తయారవడం. ఓ ఫార్మా కంపెనీలో చేరితే ఎలాంటి పనులు ఉంటాయో ముందుగానే విద్యార్థికి ఈ సీమన్స్‌ కేంద్రంలో నేర్పిస్తారు.

ఒకవైపు చదువు.. మరోవైపు ప్రాక్టికల్‌ విజ్ఞానం ఉండటం వల్ల విద్యార్థులు సులభంగా ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. విద్యార్థి చదువు పూర్తి చేసేటప్పటికి ఉద్యోగానికి అర్హత సాధిస్తున్నాడు.

విద్యాలయాలు సైతం…

గతంలో కొన్ని పరిశ్రమలే ఎక్కువగా విద్యార్థులను ఎంపిక చేసుకునేవి. ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాలయాలు సైతం ప్రాంగణ ఎంపికలకు వస్తున్నాయి.

ఈ ఏడాది సుమారు 100 మంది విద్యార్థులు మంచి ప్యాకేజీలతో వీటికి ఎంపికయ్యారు. రూ. 6.50 లక్షల ప్యాకేజీతో ఆకాశ్‌ గ్రూప్‌ విద్యా సంస్థలు 12 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.

సైన్స్‌ గ్రూపుల్లో ఏటా ప్రాంగణ ఎంపికలు పెరుగుతున్నాయి. 2014-15తో పోలిస్తే సుమారు ఆరురెట్లు పెరిగాయి. 2014-15లో 120 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికవగా.. 2018-19కి 26 విభాగాల నుంచి 863 ఎంపికవటం విశేషం.

గతంతో పోల్చుకుంటే ఆయా కంపెనీలే ఏయూలో ప్రాంగణ ఎంపికలకు ముందుకు వస్తున్నాయి. ఏయూకి జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, ఇక్కడ విద్యార్థులకు అందుతున్న విద్యా బోధనలు దీనికి కారణం.

విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం చదువుతో పాటు పెంచుతున్నాం. దీనివల్ల కూడా సులభంగా ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo