News

Realestate News

జపాన్‌ శిక్షణకు నగర క్రీడాకారులు

City players train Japan Janakiram others


జపాన్‌ శిక్షణకు నగర క్రీడాకారులు

ఎంపికైన క్రీడాకారులతో జానకీరాం తదితరులు

 జపాన్‌ శిక్షణకు నగర టేబుల్‌టెన్నిస్‌ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం హోటల్‌ మేఘాలయలో

జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ జానకీరామ్‌ మాట్లాడుతూ గత ఏడాది 250 మంది

క్రీడాకారులతో విశాఖలో టోర్నీ నిర్వహించామని, ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన సంయుక్త, దత్త అవినాష్‌ను ఈ

శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిని జపాన్‌ క్రీడాకారులతో ఆడించి, అక్కడ ఉన్న ఒలింపియన్స్‌తో శిక్షణ

ఇప్పించనున్నట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి పది రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. రోటరీ క్లబ్‌ విశాఖ వ్యాలీ

అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ క్రీడాకారుల పర్యటనకు రోటరీ క్లబ్, ఎల్‌ ఏంజెల్స్‌ వలంటీర్స్‌ సంఘం రూ.20లక్షల వరకు

ఖర్చు చేస్తున్నాయన్నారు. జిల్లా టేబుల్‌టెన్నిస్‌ సంఘం కార్యదర్శి డి.వి.ఎస్‌.వై.శర్మ మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబరు

11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు నగరంలో జరుగుతాయన్నారు. ఇందులోంచి

నలుగురు విజేతలను తదుపరి జపాన్‌ టూర్‌కు ఎంపిక చేయనున్నట్లు వివరించారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo