చైనా విద్యార్థులు తిరిగొస్తే 1500 డాలర్లు ఇస్తాం!
చైనా విద్యార్థులు తిరిగొస్తే 1500 డాలర్లు ఇస్తాం!

ఆస్ట్రేలియా విద్యారంగంపై కొవిడ్ వైరస్ ప్రభావం పడకుండా ఉండేందుకు అక్కడి విశ్వవిద్యాలయాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి.
నేరుగా చైనా నుంచి కాకుండా మూడో దేశం మీదుగా ఆస్ట్రేలియాకు వచ్చే విద్యార్థులకు 1500 ఆస్ట్రేలియా డాలర్లు (రూ.70,000) అందిస్తామని వెస్టర్న్ సిడ్నీ వర్సిటీ ప్రకటించింది.
కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనా నుంచి ఎవరొచ్చినా జాగ్రత్తగా పరీక్షిస్తున్నాయి. కొన్ని దేశాలైతే చైనీయుల రాకుండా ఆంక్షలు విధించాయి.
ఆస్ట్రేలియా సైతం చైనా మీదుగా విదేశీయులు నేరుగా తమదేశంలోకి రాకుండా ఫిబ్రవరి 29వ తేదీ వరకు నిషేధం విధించింది.
చైనా నుంచి కాకుండా మరో దేశంలో 14 రోజులుండి వస్తే అనుమతిస్తామని తెలిపింది. ఈ నిబంధనతో ఉన్నత విద్య కోసం అక్కడి విద్యార్థులు రాకుండా వేరే దేశాలకు వెళ్తారేమోనని ఆసీస్ వర్సిటీలు బెంగపడుతున్నాయి.
వేరే దేశంలో కొన్ని రోజులుండి ఆస్ట్రేలియాలకు రావాలంటే విద్యార్థులకు ఖర్చు ఎక్కువవుతుంది.
అందుకనే వాటిని భరించేందుకు వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం ఒక్కో విద్యార్థికి 1500 ఆస్ట్రేలియా డాలర్లు సబ్సిడీగా చెల్లిస్తామని ప్రకటించింది.
ఆసీస్ జీడీపీలో విదేశీ విద్యార్థుల ద్వారా వచ్చే ఆదాయం 35 ఆస్ట్రేలియా బిలియన్ డాలర్లుగా ఉంటుంది. అందులో మూడో వంతు వాటా చైనీయులదే.
అక్కడి విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1,05,000 మంది చైనా విద్యార్థులు ఉంటారు. ఇందులో 10% చైనీయులు తగ్గితే 7,500 ఉద్యోగాలు నష్టపోయే అవకాశం ఉంటుంది.