News

Realestate News

వచ్చే ఏడాది నుంచి ‘కేంద్రీయ’ తరగతులు

Central phone classes next year.


వచ్చే ఏడాది నుంచి ‘కేంద్రీయ’ తరగతులు

 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభమవుతాయని ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి తెలిపారు.

అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆమె న్యూస్‌టుడేతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. -న్యూస్‌టుడే, అనకాపల్లి

అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం రెండేళ్ల క్రితమే మంజూరైంది. స్థల వివాదంతోపాటు తాత్కాలిక తరగతుల ప్రారంభానికి అవసరమైన సౌకర్యాలు సమకూర్చనందునే ఆలస్యమైôది.

దీనిపై ఇప్పటికే సంబంధిత శాఖ డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడాను. ఉడ్‌పేటలోని జీవీఎంసీ పాఠశాలల్లో 11 గదులను గతంలో కేటాయించారు. కనీసం 15 గదులు ఉండాలనే నిబంధన ఉంది.

పాఠశాల ఆవరణలోనే మరో నాలుగు గదులు కేటాయించడానికి జీవీఎంసీ అధికారులు అంగీకరించారు. సిబ్బందికి క్వార్టర్లు ఉండాలి. జాతీయ రహదారిలోని ఒక అపార్టుమెంట్‌లో తాత్కాలికంగా నివాసం ఉండేందుకు ఫ్లాట్‌లు కేటాయిస్తాం.

రైల్వే, బస్‌స్టేషన్‌లు అందుబాటులో ఉండాలనే నిబంధన ఉంది. ఉడ్‌పేట ప్రాంతం రెండింటికీ దగ్గరగానే ఉంది. అందువల్ల వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

మండలంలోని సుందరయ్యపేటలో కేంద్రం ఏర్పాటు చేస్తాం. దీనికి ఇప్పటికే రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. త్వరలోనే అక్కడ పనులు ప్రారంభిస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి సుందరయ్యపేటలో భవనాలు సిద్ధమైతే అక్కడే తరగతులు నిర్వహిస్తాం.

రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తాం
అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్డు, బయ్యవరం రైల్వేస్టేషన్‌లను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పలు స్టేషన్‌ల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

అనకాపల్లి స్టేషన్‌ నుంచి రింగ్‌రోడ్డు కూడలికి వచ్చే ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. విశాఖ నుంచి విజయవాడకు డబుల్‌ డెక్కర్‌ రైలు నడిపేందుకు అధికారులు అంగీకరించారు.

విశాఖ ఎంపీతో కలిసి ఈమేరకు రైల్వే అధికారులతో మాట్లాడాం. త్వరలోనే కొత్త రైలు పట్టాలు ఎక్కుతుంది. అనకాపల్లి జిల్లా కేంద్రం కానున్నది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన బెల్లం మార్కెట్‌ ఉంది. వాణిజ్య కేంద్రంగానూ పేరుపొందింది.

అందుకే అన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు ఆపాల్సిందిగా కోరాం.

కాలుష్యం లేని పరిశ్రమలు

పార్లమెంట్‌ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. కాలుష్యం లేకుండా చూస్తాం. పరిశ్రమలతోనే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. యువతలో నైపుణ్యం పెంచే విధంగా శిక్షణ ఇస్తాం.

ఇందుకు అవసరమైన భవనాలు నిర్మిస్తాం. పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు కల్పిస్తాం. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి స్థల సేకరణ చేశారు.

స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నావంతు సహకారం అందిస్తాను.

లక్ష్మీదేవిపేట పైవంతెన పూర్తి
లక్ష్మీదేవిపేట పైవంతెన పనులు త్వరగా పూర్తి చెయ్యాల్సిందిగా రైల్వే అధికారులను కోరాం. ఇప్పటికే స్తంభాలు వేశారు. ట్రాక్‌ వద్ద పనులు రైల్వే శాఖ చేస్తుంది.

మిగిలిన పనులు రహదారులు, భవనాల శాఖ చెయ్యాల్సి ఉంది. అనకాపల్లి-పూడిమడక రహదారిలో మురుగునీరు వెళ్లేందుకు కాలువ నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారిని ఆనుకొని దీనిని కట్టాలి.

ఇప్పటికే జాతీయ రహదారి అధికారులతో మాట్లాడాను. వారు సానుకూలంగా స్పందించారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo