News

Realestate News

పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కుల రద్దు

Cancellation of Internal Marks in Tenth Class


పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కుల రద్దు

 

జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి

 పదో తరగతిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వేస్తున్న ఇంటర్నల్‌ మార్కులు 2019-20 విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి చెప్పారు.

ఆయన మంగళవారం జిల్లాలో చీడికాడలో జరిగిన పదో తరగతి విద్యార్థుల అభినందన కార్యక్రమానికి వచ్చారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలకు శతశాతం పాఠ్య పుస్తకాలను సరఫరా చేశామన్నారు.

ఎవరికైనా.. ఇంకా పాఠ్యపుస్తకాలు అవసరముంటే ఉపాధ్యాయులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో 8, 9 తరగతులకు చెందిన బాలికలకు 25,958 సైకిళ్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తరవాత పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

తరగతి గదిలో చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించామన్నారు. గుణాత్మక, నాణ్యమైన విద్య ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తోందని… తల్లిదండ్రులు ముందుచూపుతో ఆలోచించి సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు.

విడతల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామన్నారు. పాఠశాలల్లో జులై ఒకటి నుంచి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బోధించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

పాఠశాలను సందర్శించేందుకు సముదాయాల స్థాయిలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ ఉంటుందన్నారు. అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలల్లో, గుర్తింపు ఉన్న ప్రైవేటు పాఠశాలకు వర్తిస్తుందన్నారు.

జాతీయ ఉపకార వేతనాలకు పాఠశాల ప్రారంభం నుంచే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. జాతీయ ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థికి ఏడాదికి రూ. 12 వేల వరకు వస్తుందన్నారు. పాఠశాలల్లో రెండేళ్లలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య, మౌలిక సదుపాయాలు, పథకాలను అందించడంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ఒకటో తరగతిలోనే 25 వేలమందికి పైగా విద్యార్థులు చేరారని చెప్పారు.

జిల్లాలో 4,101 పాఠశాలల్లో ఇప్పటివరకు 3.18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని… ఈ చేరికలతో వారిసంఖ్య 3.5 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 110 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉందని, త్వరలోనే ఆ సమస్య తీరుతుందని తెలిపారు.

జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 30 గుర్తింపులేని ప్రైవేటు పాఠశాలలు సీజ్‌ చేశామని డీఈఓ పేర్కొన్నారు.

భోజన నాణ్యతపై ప్రభుత్వానికి నివేదిక

నవ ప్రయాస్‌ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లేకపోవడం, మెనూ పాటించకపోవడంపై నోటీసులు జారీ చేశామని జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి చెప్పారు.

చీడికాడ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి హాజరై విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలించారు. నాణ్యత లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

నవ ప్రయాస్‌ సంస్థ మధ్యాహ్న భోజన ఒప్పందం రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. అనంతరం తురువోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు.

అక్కడ మౌలిక సదుపాయాలు, ప్రహరీ సమస్యను ఉపాధ్యాయులు వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ గంగరాజు, ప్రధానోపాధ్యాయులు రాజశ్రీ, ఉపాధ్యాయుడు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo