వీధివ్యాపారులంతా ఈపోస్ యంత్రాలను వినియోగించాలి

కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
వన్‌టౌన్:
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు వీధి వ్యాపారులంతా ఈపోస్ యంత్రాలను వాడాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో వీధి వ్యాపారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన కూడళ్లలో అవసరాలకు తగ్గట్టుగా ఈ పోస్యంత్రాలను ఏర్పాటు చేస్తామని, వ్యాపారులంతా కచ్చితంగా వీటినే వినియోగించి, నగదు రహిత వ్యాపార లావాదేవీలు జరపాలన్నారు. ముద్ర రుణాలు పొందిన వారంతా తక్షణమే రూపే కార్డులు తీసుకోవాలన్నారు.
ముద్ర రుణాలు పొందిన వ్యాపారుల ఖాతాల్లోకి రూ.2వేల చొప్పున రుణంగా జమచేస్తామని చెప్పారు. చిల్లర సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈమేరకు వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. జేసీ జి.సృజన, యూసీడీ పీడీ శ్రీనివాసన్, ఏపీడీ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.