News

Realestate News

BJP party Visakhapatnam MP candidate Daggubati Purandeswari

GVS Sathyanarayana (Vikram) Modi's efforts for the welfare of the poor.


విశాఖ అభివృద్ధికి కృషిచేస్తా

 

నరేంద్రమోదీ అవినీతి రహిత పాలన గుర్తించండి

21-450_165

పురందేశ్వరికి బీఫాం అందజేస్తున్న ఎంపీ హరిబాబు

విశాఖ అభివృద్ధికి గతంలో ఎంతో కృషిచేశానని భారతీయ జనతా పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

భాజపా నగర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భాజపా పార్లమెంటు అభ్యర్థికి ఓటు వేస్తే నరేంద్రమోదీకి ఓటు వేసినట్లుగా భావించాలన్నారు.

అవినీతి రహిత పాలన నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకే సాధ్యమన్నారు. గతంలో విశాఖ పార్లమెంటు సభ్యులుగా ఉన్నపుడు విశాఖ బీచ్‌ అభివృద్ధి, విమానాశ్రయానికి నైట్‌ ల్యాండింగ్‌ సదుపాయానికి కృషిచేశానన్నారు.

అనకాపల్లి – ఆనందపురం ఆరులైన్ల జాతీయ రహదారి తన కృషే అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీని గెలిపించాలని కోరారు. ఎంపీ హరిబాబు పురందేశ్వరికి బీఫాం అందజేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఉత్తర ఎమ్మెల్మే అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ అవినీతి మంత్రుల్లో గంటా శ్రీనివాసరావు నంబర్‌ వన్‌ అని ఆరోపించారు. ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్, నగర అధ్యక్షులు ఎం.నాగేంద్ర, ఎమ్మెల్యే అభ్యర్థులు సుహాసినీ ఆనంద్‌ పాల్గొన్నారు.

కశింకోటలో ప్రచారం చేస్తున్న జీవీఎస్‌.సత్యనారాయణ (విక్రమ్‌)

పేదల సంక్షేమానికి మోదీ కృషి

పేదల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి డా.గండి వెంకట సత్యనారాయణ (విక్రమ్‌) అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి కశింకోటలో ప్రచారం నిర్వహించారు. దుకాణాలతో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. భాజపాను గెలిపించాలని కోరారు.

సోమవారం కలెక్టరు కార్యాలయంలో వేసే నామినేషన్‌ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

ఈయన వెంట హిమశేఖర్‌ కళాశాల కరస్పాండెంట్‌ కొణతాల జనార్దన్, భాజపా నాయకులు ఎం.ఎం.నాయుడు, జనపరెడ్డి హరనాథ్, బొబ్బరి అప్పారావు, కలవలపల్లి రాజారావు తదితరులు ప్రచారం చేశారు. తాళ్లపాలెం శివారు బంగారయ్యపేటలో ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పొన్నగంటి అప్పారావు ఇంటింటి ప్రచారం చేశారు.