News

Realestate News

భారత్ కరోనా విజృంభణ.. 24 గంటల్లో కేసులు చూస్తే..

భారత్ కరోనా విజృంభణ.. 24 గంటల్లో కేసులు చూస్తే..

                                                         

ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా దెబ్బతిన్న నాలుగవ దేశమైన భారతదేశంలో గత 24 గంటల్లో 11,000 కి పైగా కేసులు, మూడొందలకు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
గత 24 గంటల్లో 11,458 కొత్త కోవిడ్ -19 కేసులు , 386 మరణాలు సంభవించాయి, దీంతో భారతదేశ సంక్రమణ
కేసులు 308,993 కు చేరుకున్నాయి. గత 10 రోజుల్లో 100,000 కేసులు జోడించబడ్డాయి. గతంలో నమోదైన 100,000 కేసులకు 15 రోజులు పట్టింది. ఇక మొదటి 100,000 కేసులు మాత్రం 78 రోజులు పట్టింది.

అన్ని కేసులలో నాలుగింట ఒక వంతు కింద గత వారంలోనే నమోదయ్యాయి.

గత 17 రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాష్‌బోర్డ్ ప్రకారం, కోవిడ్ -19 నుండి 154,329 మంది రోగులు కోలుకున్నారు.. కరోనా బారిన పడిన దాదాపు 50% మంది ఇప్పటివరకు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 145,779 గా ఉన్నాయి.

దేశంలో కోలుకున్న రోగుల సంఖ్య మంగళవారం నుండి క్రియాశీల కేసుల కంటే ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 కేసులను 300,000 కు పైగా నివేదించిన దేశాల్లో యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ , రష్యా ఉన్నాయి.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo