ఏయూ సహకార సంఘం అధ్యక్షునిగా ప్రేమానందం

ఏయూ సహకార సంఘం అధ్యక్షునిగా ప్రేమానందం

ప్రేమానందంను అభినందిస్తున్న సహకార సంఘం డైరెక్టర్లు
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగుల సహకార సంఘం అధ్యక్షునిగా ఏయూ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పేటేటి ప్రేమానందం నియమితులయ్యారు.
మంగళవారం ఉదయం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఎన్.ఎం.యుగంధర్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమానందంకు సహకార సంఘం డైరెక్టర్లు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ప్రేమానందం మాట్లాడుతూ వర్సిటీలో పనిచేస్తున్న బోధన, బోధనేతర, టైంస్కేల్ ఉద్యోగులకు రుణాల పెంపు, బంగారంపై రుణం అందించడం వంటి చర్యలు చేపడతామన్నారు.
సహకార సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉద్యోగులకు ఉపయుక్తంగా నిలుపుతామన్నారు.