News

Realestate News

నేటి నుంచే అథ్లెటిక్స్‌ పండగ

Athletics Festival from today, realestatevizag, vizag news

నేటి నుంచే అథ్లెటిక్స్‌ పండగ

వేదిక: స్టీల్‌ప్లాంట్‌ సికె నాయుడు మైదానం
క్రీడాకారులు: 3,483 మంది
అంశాలు: 30
ప్రారంభం: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

జాతీయస్థాయి జూనియర్‌ అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. గతేడాదీ ఈ పోటీలకు నగరమే ఆతిథ్యమిచ్చింది. ఈసారి ఉక్కు కర్మాగారంలోని సీకే నాయుడు స్టేడియాన్ని సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 400 జిల్లాల నుంచి 3,483 మంది పిల్లలు 30 అంశాల్లో పోటీ పడతారు. షాట్‌పుట్‌, జావెలిన్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌, డిస్క్‌త్రో, పోల్‌వాల్ట్‌ తదితర విభాగాల్లో ఆసక్తికర పోటీ జరగనుంది. మైదానాన్ని సిద్ధం చేశారు. పోటీలను ఉదయం 9 గంటలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు.
అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య!

జగదాంబకూడలి :

ఆర్థిక ఇబ్బందులు, అప్పులిచ్చిన వారి వేధింపులు తాళలేక బుధవారం నగరంలో భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోడమల్లి విజయగోపాల్‌(55), నాగ రాజ్యలక్ష్మి(48) దంపతులు అనకాపల్లి సమీపంలోని మునగపాక మండలం నాగులపల్లి గ్రామానికి చెందినవారు. వీరి కుమార్తె మీనాకు ఇటీవల వివాహం జరిపించారు. అల్లుడు విదేశాల్లో విధులు నిర్వహిస్తున్నారు. విజయగోపాల్‌, నాగ రాజ్యలక్ష్మి ఈనెల 22న తమ గ్రామం నుంచి బయలుదేరి విశాఖ నగరానికి చేరుకున్నారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు లాడ్జిలో అద్దెకు దిగారు. బుధవారం ఉదయం బయటకు వెళ్లి తిరిగి సాయత్రం 6 గంంటలకు లాడ్జికి చేరుకున్నారు.

గురువారం మధ్యాహ్నం 3 గంటలయినా గది తలుపులు తీయలేదు. లాడ్జి సిబ్బంది పలుమార్లు తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లాడ్జికి చేరుకొని గది తలుపులను పగలగొట్టి చూసేసరికి లోపల మంచంపై దంపతులిద్దరూ మృతిచెంది ఉన్నారు. పక్కనే పురుగు మందు డబ్బా, ఆత్మహత్య లేఖ ఉన్నాయి. ‘ఆర్థిక ఇబ్బందులు, అప్పులిచ్చిన వారి వేధింపులు తాళలేక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు అందులో రాసి ఉంద’ని పోలీసులు వివరించారు. ఈమేరకు లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన తల్లిదండ్రులు మృతిచెందినట్లు తెలుసుకున్న కుమార్తె మీనా ఘటనా స్థలానికి చేరుకొని రోదించింది. మృతుడు చొడమల్లి విజయగోపాల్‌ సోదరులు నగరంలోనే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo