Posted on May 10, 2019 by Mohan Manikanta in Realestate News
ఆసెట్ పరీక్షల తీరుతెన్నుల పరిశీలన
ఏయూ ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో ఆసెట్ పరీక్షల
సరళిని పరిశీలిస్తున్న ఏయూ వీసీ ఆచార్య జి నాగేశ్వరరావు
ఆసెట్ పరీక్షల తీరుతెన్నుల పరిశీలన
ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ, సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.
తొలిరోజున ఉదయం 9 గంటలకు భౌతికశాస్త్రం, ఎం.కామ్, బి.ఎఫ్.ఎ కోర్సులకు, ఉదయం 11.30 గంటలకు జియాలజీ, స్టాటిస్టిక్స్, ఆంగ్లం, మధ్యాహ్నం 2.30గంటల నుంచి తెలుగు, ఎం.హెచ్.ఆర్.ఎం, ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులకు పరీక్షలు నిర్వహించారు.
ఏయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను వీసీ ఆచార్య జి నాగేశ్వరరావు పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పరీక్ష ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ పట్ల వీసీ సంతృప్తి వ్యక్తం చేశారు. వీసీ వెంట ప్రవేశాల సంచాలకులు ఆచార్య నిమ్మ వెంకటరావు తదితరులు ఉన్నారు.