News

Realestate News

నేటి నుంచి ఆసెట్‌, ఆఈట్‌ ప్రవేశ పరీక్షలు

Asset entrance exams today onwards. Examinations will be held from today. The test kit out of the vehicle and the AU Registrar K. Acharya. Niranjan started.

నేటి నుంచి ఆసెట్‌, ఆఈట్‌ ప్రవేశ పరీక్షలు

నేటి నుంచి ఆసెట్‌, ఆఈట్‌ ప్రవేశ పరీక్షలు

 ఆసెట్‌, ఆఈట్‌ ప్రవేశ పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సామగ్రితో బయలుదేరిన వాహనాన్ని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె. నిరంజన్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఎన్‌.వెంకటరావు మాట్లాడుతూ తొమ్మిదో తేదీ ఉదయం 9 గంటలకు ఫిజికల్‌ సైన్స్‌, ఎం.కామ్‌, బీఎఫ్‌ఎ కోర్సులకు, ఉదయం 11.30 గంటలకు జియాలజీ, స్టాటస్టిక్స్‌, ఆంగ్లం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి తెలుగు, ఎం.హెచ్‌.ఆర్‌.ఎం, ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.

పదో తేదీ ఉదయం 9.30 గంటలకు సమీకృత జియాలజీ, అప్లయిడ్‌ కెమిస్ట్రీ, హ్యూమనిటీస్‌ సోషల్‌ సైన్స్‌, ఉదయం 11.30 గంటలకు లైఫ్‌ సైన్స్‌, మేథమెటికల్‌ సైన్సెస్‌, మధ్యాహ్నం 2.30 గంటలకు కెమికల్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.

విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరుకావాలని సూచించారు. ఏయూ ప్రవేశాల సంచాలకుల కార్యాలయం వద్ద పరీక్షల నిర్వహణ విధానాన్ని అధికారులు రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌ను అడిగి తెలుసుకున్నారు.

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo