News

Realestate News

సచివాలయ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Armored arrangements for secretarial examination.Collector V. Vinaychand has directed the Armed Forces to conduct written examinations


సచివాలయ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌

 గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల భర్తీ కోసం వచ్చే నెల 1 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆదేశించారు. లోటుపాట్లకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. గురువారం పరీక్షల నిర్వహణకు నియమితులైన స్టేజ్‌-1, స్టేజ్‌-2 క్లస్టర్‌, రూట్‌ అధికారుల శిక్షణ శిబిరంలో మాట్లాడారు.

సామగ్రికి పటిష్ఠ భద్రత

పరీక్షల సామగ్రిని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరుస్తామని కలెక్టర్‌ చెప్పారు. పరీక్ష ముందురోజు స్టేజ్‌-1 అధికారులు సామగ్రిని తీసుకొని సమీప పోలీసుస్టేషన్ల వద్ద స్టేజ్‌-2 అధికారులకు అప్పగిస్తారని, పరీక్ష రోజు ఉదయాన్నే స్టేజ్‌-2 అధికారులు కేంద్రాలకు తరలిస్తారన్నారు. 35 క్లస్టర్లకు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌, జీవీఎంసీ కమిషనర్‌ సృజనలు నోడల్‌ అధికారులుగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.

తొలిరోజు 1.32 లక్షల మంది…

తొలి రోజు పరీక్షకు 1.32 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, వీరికోసం 406 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. వీటిని 132 రూట్లు, 35 క్లస్టర్లుగా విభజించామన్నారు. పరీక్ష కేంద్రంలో 240 మంది పట్టే విధంగా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష జరుగుతుందని చెప్పారు.

గంట ముందే చేరుకోవాలి..

అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులేవీ పరీక్షా కేంద్రాల లోపలకు తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. జేసీ శివశంకర్‌, జీవీఎంసీ కమిసనర్‌ సృజన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పించాలన్నారు. ఎలాంటి ఆరోపణలు, కాపీలకు అవకాశం ఇవ్వరాదన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మెటీరియల్‌ ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో ఐటిడీఎ పీవో బాలాజీ, ఇతర అధికారులు శ్రీదేవి, కృష్ణకుమారి, రమణమూర్తి, రామలింగేశ్వరరెడ్డి, ప్రసాద్‌, ఎ.శ్రీనివాసరావు, పీవీ రత్నం తదితరులు పాల్గొన్నారు.

 

 


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo