నేటి నుంచి 8 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్షలు

నేటి నుంచి 8 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్షలు

కలెక్టరేట్ అధికారులతో చర్చిస్తున్న ఎపిపిఎస్సి అధికారులు
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నిర్వహించే ఆన్లైన్ పరీక్షలు విశాఖలో 8 కేంద్రాల్లో జరగనున్నాయి.
ఈనెల 28 నుంచి 30 వరకూ జరిగే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లపై డీఆర్వో గున్నయ్య సోమవారం సమీక్షించారు. పరీక్షల కోసం ఏపీపీఎస్సీ నుంచి అధికారులు సిహెచ్.విశ్వనాథ్, పైడి డిల్లేశ్వరరావులు కలెక్టరేట్ పరీక్షల విభాగం పర్యవేక్షకులు పి.వి.రత్నం, ఇతర అధికారులతో మాట్లాడారు.
అటవీ, మత్స్యశాఖలతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీకోసం ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తున్నారు.
పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకూ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఒక గంట ముందుగా చేరుకోవాలని, తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రావొద్దని అధికారులు సూచించారు.
సందేహాలకు సిహెచ్.విశ్వనాథ్ (8985037943), పైడి డిల్లేశ్వరరావు (9014550915) ఫోన్నెంబర్లలో సంప్రదించాలన్నారు.