News

Realestate News

AP Voters list

There was a response to the registration of the targeted vote by universal elections. Officers, charitable organizations


వస్తున్నారు.. నవ యువ ఓటర్లు

2 నెలల్లో 2.98 లక్షల మంది చేరిక
జిల్లాలో గణనీయంగా పెరిగిన ఓటర్లు

NAVAYAVAVOTARLU_COPY

సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా చేపట్టిన ఓటు నమోదుకు స్పందన లభించింది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం..

రాజకీయ పార్టీల నేతలు ముందుచూపుతో వ్యవహరించడం.. ఓటు హక్కు పొందడాన్ని బాధ్యతగా నవతరం భావించడంతో 65 రోజుల్లోనే 2.98 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు.

ఏప్రిల్‌ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో తమ ఓటు వినియోగించుకోవడానికి ఉత్సుకతతో ఉన్నారు.ఈ ఏడాది జనవరి 11 నాటికి జిల్లా మొత్తంగా 32,80,028 మంది ఓటర్లుగా ఉంటే తాజాగా విడుదల చేసిన తుది జాబితాలో వీరి సంఖ్య 35,78,458కి పెరిగింది.

ఓటర్ల జాబితా నుంచి తొలగింపుల కోసం 76 వేల దరఖాస్తులు వస్తే కేవలం 2,4,07 ఓట్లనే తొలగించారు. ఫామ్‌-7లపై వివాదాలు చోటుచేసుకోవడం..

పోలీసు స్టేషన్‌ నుంచి ఎన్నికల సంఘం వరకు ఫిర్యాదులు చేసుకోవడంతో ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఓటరు చేర్పులపైనే ఎక్కువ మంది దృష్టిసారించడంతో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు కాగలిగారు. మరోవైపు అరకు పార్లమెంటు పరిధిలో కూడా ఓటర్లు గణనీయంగా పెరగడం విశేషం.

నగరంలో కంటే మన్యంలోనే ఎక్కువగా ఓటరు చేర్పులు జరగడం గమనార్హం.

ఓటు నమోదు విషయంలో మొదట పెద్దగా స్పందన కనిపించలేదు ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఫామ్‌-7లు రావడం, అర్హులైన ఓటర్లను సైతం తొలగించాలని దరఖాస్తులు వెల్లువెత్తడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరా తీస్తే చాలా వరకు దరఖాస్తు పెట్టిన వ్యక్తికి కూడా తన పేరున ఫామ్‌-7లు ఆన్‌లైన్‌లో పెట్టినట్లు తెలియదు.

ఎక్కువ నకిలీ ఫిర్యాదులేనని తేల్చారు. అకారణంగా ఓటు తొలగించేస్తున్నారన్న ప్రచారం జిల్లా అంతటా వ్యాపించింది. దీంతో ఎవరికి వారు తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాల్సి వచ్చింది.

క్రమంలో ఓటు లేని వారంతా ఫామ్‌-6 అందించి కొత్తగా మరలా ఓటు హక్కు పొందారు. వీరితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారు కూడా ఫామ్‌-8లతో ఓటు హక్కు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చుకోవడం కూడా కొత్త ఓటర్ల సంఖ్య పెరగడానికి దోహదపడింది.

* ప్రభుత్వం ఓటు నమోదుపై ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం చేపట్టిoది.

* సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్త్రృతంగా వినియోగించారు. ఆన్‌లైన్‌లో జాబితాను పరిశీలించి, 1950 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి ఆరా తీసి ఓటు ఉందీ లేనిది సులువుగా తెలిసుకోగలిగారు. లేదని తెలిస్తే వెంటనే వెంటనే ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునేవారు.

* ఎన్నికల వేళ తమ అనుచరుల ఓట్లపై అభ్యర్థులే దృష్టిసారించారు. అడ్డగోలుగా తొలగింపులకు పాల్పడుతున్నారనే ఆందోళనతో ప్రత్యేకించి ఓటర్ల జాబితా పరిశీలన కోసం కొంతమందిని నియమించుకున్నారు. ఇంటింటా తిరిగి ఓటు ఉందా లేదో పరిశీలించి లేనివారితో అక్కడిక్కడే ఓటు నమోదు చేయించడంలో నేతలు క్రియాశీలకంగా వ్యవహరించారు.

* మొత్తం మీద జిల్లాలో ఓటర్లు భారీగా పెరగడంతో అన్ని పార్టీల నుంచి హర్షం వ్యక్తమయ్యాయి. పోలింగు శాతం పెరిగే అవకాశం ఉంది.

* పవన్‌ కల్యాణ్‌ అంటే ఎక్కువగా ఇష్టపడే యువతను ఓటర్లుగా చేర్పించడంపై జనసేన ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఆ పార్టీ నేతలు ఓటు నమోదు చైతన్య కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

యువ ఓటర్లే నిర్ణయాత్మకం..
జిల్లాలో మొత్తం 2.98 లక్షలు ఓటర్లు పెరిగారు. వీరిలో యువ ఓటర్లే 50 శాతం పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు పార్టీల ప్రోద్బలంతో ఓటు కోసం ముందుకు వచ్చిన వారు ఉన్నారు.

మరి కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక పోరులో వీరే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో 4 వేల నుంచి 20 వేల వరకు ఓటర్లు పెరిగారు.

ఈ కొత్త ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో వారే గద్దెనెక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 2 వేల నుంచి 5 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు.

అంటే ఒకటి నుంచి మూడు శాతం ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారయ్యాయి. దీంతో ఈ ఏడాది ప్రధాన పార్టీలు కాస్త ముందుగానే తేరుకున్నాయి.

పాత ఓటర్లతో పాటు కొత్త ఓటర్లను ఆకర్షించి ఆధిక్యతను పెంచుకోవాలని చూస్తున్నాయి. అందుకే కొంతమంది నేతలు యువతకు క్రికెట్‌ పోటీలు నిర్వహించడం, క్రికెట్‌ కిట్లులాంటివి ఉచితంగా ఇస్తున్నారు. యువతను ఆకట్టుకునే విధంగా వ్యూహాలను రచిస్తున్నారు.

అరకు పార్లమెంటు పరిధిలో అధికంగా…
అరకు పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలున్నాయి. అందులో రెండు మాత్రమే జిల్లాలో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు, శ్రీకాకుళంలో పాలకొండ, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గం ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి.

వీటిలో పార్వతీపురం ఎస్సీ రిజర్వ్‌డు కాగా మిగతా అన్నీ ఎస్టీ రిజర్వ్‌డు నియోజకవర్గాలే. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 2014 ఓటర్లు కంటే 2019 ఓటర్లు 1,76,994 ఓటర్లు పెరగడం విశేషం.

ఓటు నమోదులో గిరిజనులు కూడా చైతన్యంతో ముందుకు రావడంతో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి అవకాశం కలిగింది.

పార్లమెంటు నియోజకవర్గం : అరకు

2014లో ఓటర్లు : 12,72,340

2109 తుది జాబితాలో ఓటరు : 14,49,334

పెరిగిన ఓటర్లు : 1.76 లక్షలు


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo