News

Realestate News

ప్రభుత్వ పాఠశాలలకే అమ్మఒడి వర్తింపజేయాలి


ప్రభుత్వ పాఠశాలలకే అమ్మఒడి వర్తింపజేయాలి

ఎంపీ, ఎమ్మెల్యేలను కోరిన పీఆర్‌టీయూ

ఎంపీ డాక్టర్‌ సత్యవతి, ఎమ్మెల్యే అమర్‌నాథ్‌లకు వినతిపత్రం
ఇస్తున్న పీఆర్‌టీయూ ప్రతినిధులు

 ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.జి.నాథ్‌ కోరారు.

అనకాపల్లిలో ఆదివారం ఎంపీ డాక్టర్‌ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌లను పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘ జిల్లా, మండల, పట్టణ కార్యవర్గాల ప్రతినిధులు కలిసి ఈమేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా వారిని సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందిస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం వలన రాష్ట్రంలో విద్యాభివృద్ధి పెరుగుతుందన్నారు.

అయితే పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం చేస్తే, అవి మరింత బలోపేతం అవుతాయన్నారు. మేధావులు, ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ సంస్థలు నిర్దేశించిన రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తిస్థాయిలో విద్యాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థలకు అమ్మఒడి పథకాన్ని కేటాయించడం వలన ఈ పథకాన్ని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు.

దీనిపై ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ వినతిని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

భీశెట్టి గంగాధర్, జి.అప్పారావు, పి.ఎ.ఆర్‌.వి.మహేశ్వరరావు, వరం, అర్జున, రామచంద్రరావు, ఆర్‌వీ మహేశ్వరరావు, ఆనంద్, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo