వారిలో 9మందికి కరోనా లేదు

వారిలో 9మందికి కరోనా లేదు

వారిలో 9మందికి కరోనా లేదు

                                                                                    

విశాఖ: విశాఖలోని ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రికి వచ్చిన ఐదుగురు కరోనా అనుమానితులకు నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయని రాష్ట్ర నోడల్‌ అధికారి కె.రాంబాబు తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 13 కరోనా అనుమానిత కేసుల్లో 9 నెగిటివ్‌ వచ్చాయని వెల్లడించారు. శ్రీకాకుళంలో 3, ఒంగోలులో ఒక కేసుకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉందన్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కూడా…
కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఈనెల 3న కాకినాడ జీజీహెచ్‌లో చేరిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కూడా కరోనా వైరస్‌ లేదని నిర్ధరణ అయింది.

జలుబు, తుమ్ములు ఇతర సమస్యలతో ఆసుపత్రిలో చేరిన అనుమానితుడి రక్తనమూనాలను సేకరించిన వైద్యులు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపారు.

రక్త నమూనాలను పరీక్షించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు అతడికి కరోనా వైరస్‌ లేదని తెల్చారు. ఈమేరకు నివేదికను కాకినాడ జీజీహెచ్‌కు పంపారు.