News

Realestate News

వైద్యకళాశాలలో ప్రవేశాలకు శ్రీకారం

Admissions in Medical Center gitam university.


వైద్యకళాశాలలో ప్రవేశాలకు శ్రీకారం

 

జాతీయ కోటా కింద 91వ ర్యాంకర్‌కు తొలి సీటు

91వ ర్యాంకు సాధించిన హిమాని నారాయణత్యాదికి ప్రవేశపత్రం అందజేస్తున్న

వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌

 ఆంధ్ర వైద్యకళాశాలలో 2019-20 వార్షిక ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హిమాని నారాయణాత్యాదికి తొలి ప్రవేశపత్రాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ అందజేశారు.

వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో జరిగిన నీట్‌లో హిమాని 91వ ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయి కోటాలో మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ ఆమెకు ఏఎంసీలో సీటు కేటాయించింది.

ఈ మేరకు తల్లిదండ్రులతో కలిసి హిమాని బుధవారం వైద్యకళాశాలకు వచ్చారు. ఇక వైద్యకళాశాలలో ప్రవేశాలు ప్రారంభమైనట్టేనని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు.

ఈ ఏడాది ఏఎంసీకి అదనంగా 50 సీట్లు వచ్చాయని, దీంతో వీటి సంఖ్య 250కి చేరిందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రవేశాల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కేవీవీ విజయకుమార్‌, పరిపాలనాధికారి డాక్టర్‌ పీవీఎస్‌ఎస్‌ విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

గీతం ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభం

గీతం డీమ్డ్‌ వర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి(జిమ్‌సర్‌) వైద్య కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌లో చేరడానికి బుధవారం నుంచి అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని సంబంధిత విభాగ సంచాలకుడు ఆచార్య కె.నరేంద్ర తెలిపారు.

నీట్‌లో ర్యాంక్‌ సాధించి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా గీతంను ఎంచుకున్న విద్యార్థుల జాబితాను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మంగళవారం విడుదల చేసిందన్నారు.

ఆ జాబితాలోని విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు గీతంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా సూచించిందన్నారు. ఎంసీఐ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.

ప్రవేశాలు పొందిన పలువురికి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ ప్రవేశ పత్రాలను అందజేశారు. జిమ్‌సర్‌ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.జయప్రకాశ్‌బాబు, ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి పి.శ్యామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo