News

Realestate News

గీతం సైన్స్‌ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

Admission song science courses statrted.


గీతం సైన్స్‌ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

విద్యార్థినికి ప్రవేశపత్రాన్ని అందజేస్తున్న ప్రిన్సిపల్‌ ఎం.శరత్‌చంద్రబాబు
 గీతం డీమ్డ్‌ వర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరడానికి గురువారం నుంచి ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్‌ ఆచార్య ఎం.శరత్‌చంద్రబాబు తెలిపారు.
గీతం సైన్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (జీశాట్‌-2019)లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా అడ్మిషన్లు చేపడుతున్నామన్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రవేశపత్రాలు ఆయన అందజేశారు.
ఇంటర్మీడియట్‌ బైపీసీ సబ్జెక్ట్‌లతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌(బీఈఎమ్‌), బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ), అయిదేళ్ల ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీలో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్‌, బయోటెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ కాంబినేషన్లతో కోర్సులు ఆఫర్‌ చేస్తున్నామన్నారు.
ఎంపీసీ విద్యార్థులకు మేథ్స్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిటిక్స్‌ కాంబినేషన్లతో బీఎస్సీ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.
డిగ్రీ పూర్తిచేసినవారికి ఎమ్మెస్సీలో అప్లైడ్‌మేథ్స్‌, ఫిజిక్స్‌, డేటాసైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ సైన్స్‌, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్‌, బయో టెక్నాలజీ, ఫుడ్‌సైన్స్‌ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.