News

Realestate News

A society without a bribe


లంచం లేని సమాజమే లక్ష్యం( A society without a bribe)

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

12-450_208

గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో పిడికిలి బిగించి మాట్లాడుతున్న

పవన్‌ కళ్యాణ్, పాల్గొన్న నాయకులు

శుక్రవారం 22 మార్చి 2019 ఈనాడు విశాఖపట్నం 3

ఆనందపురం, గాజువాక, న్యూస్‌టుడే : ప్రజా సమస్యలు పట్టించుకోని నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆనందపురం మండలం వేములవలస కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ప్రతిసారీ నియోజకవర్గాలు మార్చిన గంటా శ్రీనివాసరావుకు, పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం మాట్లాడని ముత్తంశెట్టికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. భీమిలి అభ్యర్థి పంచకర్ల సందీప్‌ మాట్లాడుతూ ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసునని వాటి పరిష్కారానికి పోరాటం చేస్తానన్నారు. సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నాయకులు కూడా పాల్గొన్నారు.

గాజువాక బహిరంగ సభలో పాల్గొన్న జనం

అంతకుముందు గాజువాక బహిరంగ సభలో మాట్లాడిన పవన్‌.. పెందుర్తి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డారని, వాటిని అడ్డుకోవాలంటే అక్కడ జనసేనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెందుర్తిలో చాలా భూములను తెదేపావాళ్లు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

అందుకే చింతలపూడి వెంకటరామయ్యను అక్కడి నుంచి పోటీకి పెట్టామన్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఎలమంచిలిలో పేదలకిచ్చే బస్తా బియ్యాన్ని కూడా పక్కదారి పట్టించారని ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారని, తెదేపాకు వెళ్లిన తరువాత మారిపోయారని ఆరోపించారు.

భూకబ్జాలు జరుగుతున్నా మంత్రి గంటా మాట్లాడలేదన్నారు. గంటా చట్టసభకు రాకుండా ఉండడానికి పసుపులేటి ఉషాకిరణ్‌ను రంగంలోని దించామని ఆమెను విశాఖ ఉత్తర ఓటర్లు గెలిపించాలని కోరారు.

డీసీఐ పైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు నిరంతరాయంగా పోరాడినందునే పశ్చిమ నియోజకవర్గాన్ని సీపీఐ అభ్యర్థి జె.వి.సత్యనారాయణమూర్తి(నాని)కి కేటాయించామన్నారు. విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తున్న కోన తాతారావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గాజువాక ప్రజలు తనను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీనే తన చేతుల్లోకి వస్తుందని తెలిపారు. గాజువాకలో ప్రజలకు ఏం చేస్తానో ప్రత్యేకంగా మరో సభపెట్టి వివరిస్తానని తెలిపారు.

వేములవలస బహిరంగ సభలో పార్టీ గుర్తు గాజుగ్లాసును చూపిస్తూ మాట్లాడుతున్న పవన్‌ కళ్యాణ్‌

ఈనాడు, విశాఖపట్నం

* నేను చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఉత్తి సినిమా యాక్టర్‌ననే అనుకుంటున్నారు. నేను యాక్టర్‌ని కాను. సామాజిక భావాలతో ఉన్నవాడ్ని. గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివాను. ప్రజా చట్టాల్ని చదివాను. మీకు నేను మాటిస్తున్నాను. లంచం అడగని ఎంపీ, ఎమ్మెల్యేలను మీకిస్తాను.

* నేను పదో తరగతే చదివి ఉండొచ్చు. కానీ క్రిమినల్‌ గ్యాంగ్‌లతో, కబ్జాదారులతో పోరాడే ధైర్యం నాలో ఉంది. * నేను కష్టపడే శ్రామికుడిని, కూలీని. నాకు జేజేలు, కాళ్లు మొక్కడాలు వద్దు. నాకు మీ అభిమానం చాలు. నేను మీవాడ్ని, మీ ఇంట్లో బతికేవాడ్ని. నా తల్లి, నా అన్న కూడా చూసుకోలేనంతగా మీరు నన్ను చూసుకుంటున్నారు.

* భీమిలిలో జనసేన జెండా కట్టిన ఈశ్వర్‌రెడ్డిని జైల్లో పెడతారా. గంటా.. మిమ్మల్ని వెంటాడతాం. వదలం. * గంటా శ్రీనివాసరావుపై ఓ పాట గుర్తుకొస్తోంది.. ‘ఎక్కడికి పోతావే చిన్నదాన..’ అని. భీమిలిలో ఎంతో కష్టంమీద అందరి మద్దతుతో అతన్ని గెలిపిస్తే గాలికొదిలేస్తాడా! అతను ఉత్తర నియోజకవర్గం వెళ్లినా నేను వదిలిపెట్టను. వీళ్లాడే ఆటల వల్ల రాష్ట్రం అలసిపోయింది.

* గంటా తనకు ఓటేస్తే యువకులకు లంచాలు, బైక్‌లు అడ్వాన్స్‌గా ఇస్తానంటున్నాడు. వాటిని కొంతమందే తీసుకుంటారామో. కానీ జన సైనికులు లంచాలు తీసుకునేవారు కాదు.

* జూట్‌మిల్లును తెరిపిస్తాం. ఉపాధిని కల్పిస్తాం. దివీస్‌ పరిశ్రమ కాలుష్యాల వల్ల 100 రకాల జాతుల చేపలు నశించిపోతున్నాయి. మామూలుగా అయితే ఆ కాలుష్య వ్యర్థాల్ని శుద్ధిచేసి సముద్రంలోకి వదలాలి. బాధ్యతగల ఎమ్మెల్యే, ఎంపీలుంటేనే ఇది చేస్తారు.

* భీమిలి జనసేన అభ్యర్థి పంచకర్ల సందీప్‌కు ఐదేళ్లుగా చాలా పరీక్షలు పెట్టాను. ప్రజలకు సేవ చేస్తాడని నమ్మకం వచ్చినందువల్లే అభ్యర్థిగా ఎంపిక చేశాను.