News

Realestate News

9న ఉద్యోగ మేళా

9న ఉద్యోగ మేళా

విశాఖపట్నం, న్యూస్‌టుడే : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజర్‌ సాయి శ్రీనివాస్‌ తెలిపారు. గాజువాక ఎంవీఆర్‌ డిగ్రీ కళాశాలలో జరిగే ఉద్యోగ మేళాకు 10 నుంచి 15 ప్రైవేటు కంపెనీలు హాజరవుతాయని తెలిపారు.

పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ యువత ఈ జాబ్‌మేళాకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎ.పి.ఎస్‌.ఎస్‌.డి.సి. వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రిఫరెన్స్‌ నెంబరుతో పాటు 3 బయోడేటాలు, విద్యార్హతల ధ్రువపత్రాలతో పాటు ఈనెల 9న (శనివారం) ఉదయం 10 గంటల నుంచి జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని, ఇతర వివరాలకు 9959361548, 18004252422 ఫోన్‌నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఈనెల 7న..: డీఆర్‌డీఏ-ఉపాధి కల్పనా మిషన్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 7న ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు పీడీ రామ్మోహన్‌ తెలిపారు. స్విగ్గిలో డెలివరీ పార్టనర్‌ పోస్టులకు పది ఉత్తీర్ణులై, ద్విచక్రవాహనం కలిగి ఉండాలని, ఇన్నోవ్‌సోర్స్‌లో ఎస్‌.బి.ఐ. కార్డులకు సంబంధించి పది, ఆపై చదివిన వారు అర్హులన్నారు.

బిగ్‌బజార్‌లో సేల్స్‌బోయ్స్‌, క్యాషియర్స్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఆపై చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 7న పెందుర్తి, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదురుగాగల టీటీడీసీ ఆవరణలో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని, ఇతర వివరాలకు 7993312893 ఫోన్‌నెంబరులో సంప్రదించాలని కోరారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo