Posted on June 08, 2019 by Mohan Manikanta in Realestate News
‘బెస్ట్ అవైలబుల్’ ప్రవేశ పరీక్షకు 72శాతం హాజరు
పరీక్షలను పర్యవేక్షిస్తున్న రామారావు
సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా నడుస్తున్న బెస్టు అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
శుక్రవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా 11 సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో, ఐడీటీఏకు చెందిన ఆశ్రమ పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహించారు. 5వ తరగతి ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థులు, 5, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థులు మొత్తం 1225 మంది హాజరుకావాల్సి ఉండగా, 72 శాతం అంటే 873 మంది పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షలను సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు జయప్రకాష్, సాంఘిక సంక్షేమాధికారి రామారావు పర్యవేక్షించారు. ఫలితాలు వారం రోజుల్లో వెలువడతాయని, ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారని అధికారులు పేర్కొన్నారు.