News

Realestate News

65 కిలోమీటర్ల పొడవునా మొక్కల పెంపకం

02-06-2016-003 vizag realestate news

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ఏడు మండలాల పరిధిలోని 35 గ్రామాల్లో 65 కిలోమీటర్ల పొడవున మొక్కల పెంపకానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉపాధిహామీ పథకం సహాయ ప్రాజెక్టు సంచాలకుడు శ్రీనివాస్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం వీఆర్‌పీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీశాఖ నుంచి 26,500 నీడనిచ్చే మొక్కలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది 670 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జరిగేలా చూడాలన్నది లక్ష్యమన్నారు. నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, రోలుగుంట, రావికమతం మండలాల్లో 58 వేల ఇంకుడు గుంతలు తవ్వాలన్నది లక్ష్యమన్నారు. సామగ్రి కొరతని అధిగమించి నూరుశాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. 2300 పంట కుంటలకుగాను ఇప్పటివరకు 135 పూర్తయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జానకిరావు, ఉపాధి హామీ ఏపీవో సూర్యమణి తదితరులు పాల్గొన్నారు.