News

Realestate News

50 మైక్రాన్ల లోపు కవర్ల తయారీతో నష్టం


50 మైక్రాన్ల లోపు కవర్ల తయారీతో నష్టం

కాలుష్య నియంత్రణ బోర్డు పర్యావరణ ఇంజినీరు లక్ష్మీనారాయణ

50 మైక్రాన్ల లోపు కవర్ల తయారీతో నష్టం

ప్లాస్టిక్‌ వినియోగంలో వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదకత బాధ్యత (ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్స్‌బులిటీ) విధానాన్ని భారతదేశంలో అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాలుష్య నియంత్రణ బోర్డు పర్యావరణ ఇంజినీరు లక్ష్మీనారాయణ అన్నారు.

తెలంగాణ. అంధ్రప్రదేశ్‌ ప్లాస్టిక్‌ తయారీ సంస్థల సంక్షేమ సంఘం (తాప్మా) ఏపీ ఉపాధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మినారాయణ ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

50 మైక్రాన్ల లోపు కవర్ల తయారీని ఆపకుంటే పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో మాత్రమే 11 కేజీల తలసరి ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.

మరో అతిథి జీవీఎంసీ వైద్యాధికారి డాక్టర్‌ హేమంత్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వినియోగంపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలని అన్నారు. ఆల్‌ ఇండియా ప్లాస్టిక్‌ సంఘం ప్రతినిధులు మీల జయదేవ్‌, అనీల్‌రెడ్డి, ఐలా మాజీ కార్యదర్శి బాపిరాజు, శ్రీనివాస్‌, రత్న పాల్గొన్నారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo