News

Realestate News

తాగునీటికి రూ. ఐదు కోట్లు

5 crores for water, vizagrealestate, vizag

విశాఖ :

రాష్ట్ర ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న అరకులోయ మండలం పెదలబుడు గ్రామ పంచాయతీ పరిధిలోని 14 నివాసిత ప్రాంతాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు రూ. ఐదు కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ నిధులను విడుదల చేశామని, ఈ మొత్తంతో తాగునీటి వసతులను పెంపొందిస్తామన్నారు. అరకులోయకు రూ. రెండు కోట్లు, పెదలబుడుకు రూ.27 లక్షలు, లిట్టగుడకు రూ.50 లక్షలు చొప్పున కేటాయించామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తారని చెప్పారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo