News

Realestate News

‘గాంధీ’లో ఊడిన సీలింగ్ ఫ్యాన్.. కరోనా రోగులకు గాయాలు!


‘గాంధీ’లో ఊడిన సీలింగ్ ఫ్యాన్.. కరోనా రోగులకు గాయాలు!

              

కోవిడ్ ఆస్పత్రిగా మారిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించడం తెలిసిందే. అయితే ఆస్పత్రిలో చక్కని సదుపాయాలు ఉన్నాయని అధికారులు తోసిపుచ్చారు. అంత చక్కని ఆస్పత్రిలో కరోనా రోగుల వార్డులో ఓ సీలింగ్ ఫ్యాన్ ఊడిపోయి రోగులపై పడిపోయింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

ఏడో అంతస్తులోని వార్డులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సరిగ్గా బెడ్లపైనే పడిపోవడంతో ఇద్దరు గాయపడ్డారు. దీనిపై రోగులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మందుల సంగతి తర్వాత, ముందు ఫ్యాన్లను సరిగ్గా బిగించడని కోరుతున్నాయి. అయితే ఈ విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని, ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు.