News

Realestate News

దూసుకొస్తోన్న నిసర్గ తుఫాన్

దూసుకొస్తోన్న నిసర్గ తుఫాన్

ఓ వైపు కరోనా, మరోవైపు ఆర్థిక సమస్యలతోనే సతమతమవుతుంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా దెబ్బతీస్తున్నాయి. తుఫాన్ల రూపంలో ప్రకృతి విరుచుకుపడుతోంది.

ఇప్పటికే ఆంఫన్ తుపాన్ కకావికలం చేయగా తాజాగా మరో తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్‌గా రూపంతరం చెందింది. ఈ సైక్లోన్‌కు నిసర్గ అని పేరు పెట్టారు.

ప్రస్తుతానికి, ఈ తుఫాన్ గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 350 కిలోమీటర్లు, ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 675 కిలోమీటర్లు, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షిణ నైరుతి దిశగా 900 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 3 సాయంత్రానికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశముంది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మధ్య తుఫాన్ తీరాన్ని దాటే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.

మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు నిసర్గ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. సైక్లోన్ ప్రభావంతో జూన్ 2వ తేదీన గంటకు 105 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. జూన్ 3న గాలుల వేగం 125 కిలోమీటర్లకు పెరుగుతుంది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ జిల్లాల్లోపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జూన్ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. జూన్ 4 తర్వాత తుఫాన్ బలహీనపడుతుంది. నిసర్గ సైక్లోన్ విరుచుకుపడే ప్రమాదం ఉండడంతో మహారాష్ట్ర, గుజరాత్‌లలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలు కరోనాతో కకావికలం అవుతు న్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వైరస్ బాధితుల సంఖ్య వేలల్లో ఉంది. కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రభుత్వాలు విపరీతంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తుఫాన్ దూసుకువస్తుండడంతో అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

గత నెలలో ఆంఫన్ తుపాన్ విరుచుకుపడింది. బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం సృష్టించింది. అసోం, మేఘాలయాలపైనా ఆంఫన్ ప్రభావం పడింది. ఆంఫన్ సైక్లోన్ దెబ్బకు కోల్‌కతా, దక్షిణ 24 పరగణా లు, ఉత్తర 24 పరగణాలు, గంజాం, పూరీ, ఖుద్రా, జగత్‌సింగ్‌పూర్, కటక్, భద్రక్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

             


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo