News

Realestate News

దిల్లీలో 122 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కరోనా!

దిల్లీలో 122 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కరోనా!

                          

దిల్లీ: దిల్లీలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ 31వ బెటాలియన్‌లో ఇప్పటి వరకు 122 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. మరో 100 మంది ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.

గత కొన్ని రోజులుగా మహమ్మారి విజృంభిస్తుండడంతో వారు ఉంటున్న మయూర్‌ విహార్‌ ఫేజ్‌-3 ప్రాంతాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్బంధంలో ఉంచారు.

పాజిటివ్‌ వచ్చిన వారిలో చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు పేర్కొన్నారు. వీరందరినీ మండోలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

శుక్రవారం కొత్తగా 12 మందికి వైరస్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ వారం మొదట్లో 55 ఏళ్ల వయసున్న ఓ ఎస్‌ఐ కరోనా ధాటికి చనిపోయిన విషయం తెలిసిందే. సెలవులపై వెళ్లి వచ్చిన ఓ కానిస్టేబుల్‌ నుంచే బెటాలియన్‌లో మిగతా వారికి ఈ వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి..