News

Realestate News

25 వేల పీపీఈ కిట్లు అందించిన షారుఖ్‌

25 వేల పీపీఈ కిట్లు అందించిన షారుఖ్‌

                         

 భారత్‌లో కొవిడ్‌-19పై జరుగుతున్న పోరాటానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఇటీవల ప్రకటించారు.

అన్నట్టుగానే, ఈ పోరాటంలో ముందువరసలో నిలిచిన వైద్య సిబ్బంది కోసం 25,000 వ్యక్తిగత రక్షణ తొడుగు (పీపీఈ)లను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు.

షారుఖ్‌ చర్యకు మహారాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి రాజేశ్‌ తోపే కృతజ్ఞతలు తెలుపుతూ… మీరు చేసిన ఈ సహాయం కొవిడ్‌ వ్యతిరేక పోరాటంలో చాలా మేలు చేస్తుందని తెలిపారు.

ఇందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్‌ ”మనల్ని, మానవాళిని కాపాడుకునే ఈ ప్రయత్నంలో మనందరం ఒక్కటవ్వాలి. ఈ విధంగా సహాయం చేయగలిగినందుకు ఆనందంగా ఉంది.

మీరు, మీ కుటుంబాలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను.

” అని ట్విటర్‌ ద్వారా షారుఖ్‌ తెలిపారు. షారుఖ్‌ గతంలో కూడా తన కార్యాలయాన్ని మహిళలు, వృద్ధులు, చిన్నారులకు వైద్యసహాయం అందించే క్వారంటైన్‌ కేంద్రంగా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రకటించారు.