News

Realestate News

ప్రయాణికుల ఆటోలు కనిపిస్తే సీజ్‌

ప్రయాణికుల ఆటోలు కనిపిస్తే సీజ్‌

                                       

జాతీయ రహదారిలో తిరుగుతున్న ఆటోను నిలిపివేసిన రవాణా శాఖ అధికారులు

మాధవధార, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశామని, అయినప్పటికీ ఆటోలో ప్రజలను తీసుకువెళ్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని డీటీసీ జి.సి.రాజారత్నం పేర్కొన్నారు.

గత మూడు రోజులుగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి, 9 ఆటోలను సీజ్‌ చేసినట్లుగా ఆయన తెలిపారు. వైద్య, ముఖ్యమైన పనులకు మాత్రమే వాహనాలను వినియోగించాలన్నారు. నిత్యావసర వస్తువుల చేరవేతకు ఆటంకం కలగకుండా వాహనాలకు అనుమతులు ఇచ్చామన్నారు.