News

Realestate News

అనుమానంతో ఆసుపత్రికి తరలింపు

అనుమానంతో ఆసుపత్రికి తరలింపు

                                      

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 37వ వార్డు పెయిందొరపేట రెల్లివీధి అంబేడ్కర్‌ కల్యాణ మండపం సమీపంలో నివాసం ఉంటున్న ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చాడు.

వచ్చినప్పటి నుంచి జలుబు, దగ్గుతో బాధ పడుతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం పోలీసుల సమక్షంలోనే బాధితుడిని వైద్యులు ఆసుపత్రికి తరలించారు.

నిర్వాసిత అప్పికొండలో…

కూర్మన్నపాలెం: విదేశాల నుంచి వచ్చిన వారు వీధుల్లో తిరుగుతుండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ఇద్దరు దుబాయ్‌ వెళ్లి ఇటీవల కణితి నిర్వాసిత అప్పికొండ కాపు వీధికి తిరిగొచ్చారు.

వీధుల్లో స్నేహితులతో సంచరిస్తుండటంతో నివాసితులు గుర్తించారు. వీరు జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నట్లు వదంతులు రావడంతో స్థానికులు హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 104కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. దీంతో 108 వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం వీరిని అంబులెన్స్‌లో తరలించారు.